సచివాలయాల ఉద్యోగుల డిమాండ్ల పై తేల్చేసిన ప్రభుత్వం, అవి అసాధ్యం..!!
వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల డిమాండ్ల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విజయవాడ లో అనుమతి లేకుండా ఉద్యోగులు నిరసనకు దిగటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల డిమాండ్ల పైన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టత ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల కు చేయగలిగింది చేస్తామని చెప్పారు. ప్రభుత్వాధినేతల పైన విచక్షణా రహితంగా మాట్లాడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
స్వర్ణ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు విజయవాడలో భారీ నిరసనకు దిగారు. ఈ సమయంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. మిగిలిన డిమాండ్ల పైనా స్పందించింది. తాము ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తుంటే నిందించటం సరి కాదన్నారు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు అసాధ్యమని తేల్చి చెప్పారు. సచివాలయ శాఖ ఉద్యోగుల ఆందోళన కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ప్రమోషన్ ఛానల్ విధానం పై శాఖ కార్యదర్శి చాలా బాగా పని చేసారని చెప్పారు. ఉద్యోగుల ప్రమోషన్ కు అసలు నియామకాల్లో నిబంధన లేదని.. అయినా ప్రభుత్వం వారికి ప్రమోషన్ ఇచ్చే అంశంలో కసరత్తు చేస్తున్నారని వివరించారు. సచివాలయ శాఖ లో 1.20 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయని.. గత ప్రభుత్వం మిమ్మలిని ఉద్యోగాలు ఇచ్చి గాల్లో వదిలేసిందని విమర్శించారు.

సచివాలయ ఉద్యోగుల ఆందోళన వేళ
ప్రభుత్వం ఇన్ని చేస్తే .. ప్రభుత్వం పై ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నోషనల్ ఇంక్రిమెంట్ అనేది ప్రభుత్వం లో లేదని తేల్చి చెప్పారు. అసలు ఈ శాఖలో ప్రమోషన్ అనే విధానం మే లేదని స్పష్టం చేసారు. తాము ఉద్యోగుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పుకొచ్చారు. వీరు ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నారు.. వీరి వెనకాల ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. స్వర్ణ గ్రామ , వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సైతం స్పందించారు. ఎక్కడ సర్వీస్ రూల్స్ లో ప్రమోషన్ల అంశం లేదని వివరించారు.













Click it and Unblock the Notifications
