వాయుసేన కోసం భారీ ఒప్పందం! రంగంలోకి శక్తివంతమైన ‘కేసీ-390’ జెట్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తాను మరింత పెంచే దిశగా రక్షణ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రక్షణ అవసరాల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 60 మీడియం రవాణా విమానాల ప్రాజెక్టు కోసం బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం 'ఎంబ్రాయర్' మన దేశానికి చెందిన మహీంద్రా గ్రూప్‌తో చేతులు కలిపింది. భారత గగనతలంలో సైనిక అవసరాల కోసం మహీంద్రాను తమ ప్రత్యేక భాగస్వామిగా ఎంబ్రాయర్ అధికారికంగా ఖరారు చేసింది.

ప్రస్తుతం వాయుసేనలో ఏళ్ల తరబడి సేవనందిస్తున్న పాతబడ్డ ఏఎన్-32 (AN-32) రవాణా విమానాల స్థానంలో సరికొత్త, ఆధునిక విమానాలను తీసుకురావాలని రక్షణ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కింద మొత్తం 60 విమానాలను కొనుగోలు చేయనున్నారు. అవసరమైతే ఈ సంఖ్యను మరో 50 శాతం పెంచే వెసులుబాటు కూడా ఉంది. ఈ భారీ కాంట్రాక్ట్ కోసం మహీంద్రా సహా టాటా, హెచ్‌ఏఎల్, రిలయన్స్, అదానీ వంటి ఐదు ప్రముఖ భారతీయ కంపెనీలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే 'ఆర్ఎఫ్‌పీ' (RFP) జారీ చేసింది.

Embraer and Mahindra Team Up to Offer KC-390 Millennium for Indian Air Force 60 Aircraft Program

ప్రత్యేకత ఏంటంటే.. సీ-390 మిల్లీనియం సత్తా

ఈ ప్రాజెక్టు కోసం ఎంబ్రాయర్ సంస్థ అత్యంత శక్తివంతమైన తన ట్విన్-ఇంజన్ 'కేసీ-390 మిల్లీనియం' (KC-390 Millennium) రవాణా విమానాలను రంగంలోకి దించుతోంది. ఈ విమానం ఏకంగా 26 టన్నుల బరువును మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, గంటకు 470 నాట్ల వేగంతో దూసుకెళ్లగలదు. ప్రస్తుతం అమెరికాకు చెందిన సీ-130జే విమానాలతో పోటీపడుతున్న ఈ కేసీ-390, వాటికంటే మెరుగైన వేగంతో పాటు ఎక్కువ బరువును మోయగలదని ఎంబ్రాయర్ రక్షణ విభాగం సీఈఓ బోస్కో డా కోస్టా జూనియర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాలు 93 శాతం లభ్యతను, 99 శాతం మిషన్ విజయవంతం అయ్యే రికార్డును కలిగి ఉన్నాయి.

Abhinandan Varthaman కొత్త అవతారం! ఎయిర్ ఫోర్స్‌కు గుడ్‌బై
Abhinandan Varthaman కొత్త అవతారం! ఎయిర్ ఫోర్స్‌కు గుడ్‌బై

వ్యాపార రంగాలవారీగా వేర్వేరు భాగస్వామ్యాలు

ఈ ఒప్పందానికి సంబంధించి ఎంబ్రాయర్ సంస్థ స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సైనిక రవాణా విమానాల తయారీ, ఆపరేషన్స్ కోసం మాత్రమే మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. అదే సమయంలో దేశంలో సివిల్ ఏవియేషన్ అవసరాలు, ప్రాంతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు అదానీ గ్రూప్‌తో కలిసి మరో మార్గంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల మిలిటరీ, సివిలియన్ రంగాల్లో స్పష్టమైన విభజనతో పనులు వేగవంతం కానున్నాయి.

Top Gun: బీహార్ చిన్నది.. భారత్‌కే గర్వకారణమైంది! ఎవరీ భావనా కాంత్?
Top Gun: బీహార్ చిన్నది.. భారత్‌కే గర్వకారణమైంది! ఎవరీ భావనా కాంత్?

భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే ప్రణాళిక

కేవలం విమానాల సరఫరాతోనే సరిపెట్టకుండా, భారత్‌ను తమ గ్లోబల్ సప్లై చైన్ మరియు మెయింటెనెన్స్ (MRO) హబ్‌గా మార్చాలని ఎంబ్రాయర్ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే యూఏఈ, కొలంబియా వంటి దేశాలు ఈ విమానాలను కొనుగోలు చేస్తుండగా, భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రవాణా రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు పెద్దపీట వేసినట్టవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+