తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రేసులో ఢిల్లీకి ఆరుగురి పేర్లు.. ఫైనల్ ఎవరో ఉత్కంఠ!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ స్థానాల్లో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పదవీకాలం మార్చిలో ముగుస్తుంది. దీంతో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతమైంది.

నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం బాధ్యతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు. మరో స్థానం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ బాధ్యతను మంత్రి దామోదర్ రాజనర్సింహకు అప్పగించారు. వీరు సామాజిక, స్థానిక పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురి పేర్లు ఫైనల్ చేసి రాష్ట్ర పార్టీ అధిష్ఠానానికి పంపారు.

Telangana Graduate MLC Elections Congress High Command Finalising Candidates Six Names Sent to Delhi

ఆ జాబితాను పీసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు టీపీసీసి పంపించింది. ఆశావహులు చాలా మంది పోటీ పడగా నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు సిఫార్సు అయినట్లు సమాచారం. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మన్నె జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీశ్ పేర్లు వెలువడ్డాయి.

ఈనెల 29న CWC సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అప్పుడు ఈ ఆరుగురిలో ఇద్దరిని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరి నిమిషంలో కొత్త పేర్లు కూడా రావచ్చని చర్చ నడుస్తోంది. ఈ నెల చివరి వారంలో అధికారిక ప్రకటన రావచ్చు. ఏది ఏమైనా ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ మద్దతు సాధించాలని సంకల్పించిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను ఆచి తూచి చేసినట్టు తెలుస్తుంది.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్: షెడ్యూల్ ఇలా.. కీలక అంశాలపై చర్చ!
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్: షెడ్యూల్ ఇలా.. కీలక అంశాలపై చర్చ!

అన్ని సామాజిక సమీకరణాలను, స్థానిక పరిస్థితులను, స్థానిక గ్రాడ్యుయేట్స్ లో మంచి గుర్తింపు ఉన్న వారిని గుర్తించి వారి పేర్లను సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లోనే కాదు ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావించి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+