మొత్తం 12 రాశుల్లో అక్టోబరు నెల ‘కింగ్స్’ తులా రాశి, ధనుస్సు రాశి
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్నసార్లు అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. వీటివల్ల కొన్ని రాశులవారికి బాగా కలిసివస్తుంది. జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం, ఈ అక్టోబర్ నెలలో గ్రహాల గమనం, యుతులు, రాశ్యాధిపతుల స్థితిగతులను బట్టి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా అన్ని రాశులకంటే తులా రాశి, ధనుస్సు రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా, లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు రాశుల వారికి ఈ నెల ఎందుకు అంత ప్రత్యేకంగా ఉందంనే వివరాలను తెలుసుకుందాం.
తులా రాశి
ఈ రాశిలోనే రవి, బుధ, శుక్రుల కలయిక ఏర్పడడం వల్ల ఈ కాలం వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో రాజపూజ్యాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉన్నత స్థానాలు లేదా పదోన్నతులు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు చేసేవారికి లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి కూడా పూర్తిగా కోలుకుంటారు.

ధనుస్సు రాశి
ఈ రాశికి లాభ స్థానంలో శుభ గ్రహాల సంచారం, రవి ప్రభావం వల్ల అదృష్టం వెనువెంటనే నడుస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. నిరుద్యోగులకు తాము కోరుకున్న ప్రముఖ సంస్థల నుండి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు విశేషంగా లాభిస్తాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి సువర్ణావకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి వృద్ధిని చూస్తారు. అలాగే మిథున రాశి, కన్యారాశి, మకర రాశివారికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అక్టోబరు నెల మొత్తం మీద చూసుకుంటే తులా రాశి, ధనుస్సు రాశివారే కింగ్స్ అని చెప్పొచ్చు. వారే అదృష్టవంతులవడతోపాటు బాగా కలిసిరానుంది.














Click it and Unblock the Notifications
