పార్టీ వేడుకలకు కెసిఆర్ దూరం

పార్టీ కార్యాలయంలో తెరాస నేతలు నాయని నర్సింహారెడ్డి, హరీష్ రావు తదితరులు తెలంగాణా తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పంచారు. ఈసారి తెలంగాణ రావడం ఖాయమని నాయని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications