చంద్రబాబుతో కారత్ భేటీ

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళిపై, మహాకూటమి విజయవకాశాలపై వారు చర్చించారు. కేంద్రంలో తాము నిర్వహించాల్సిన పాత్రపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రధాని పదవి రేసులో ఉన్న బిఎస్పీ నేత మాయావతి, ఎన్సీపి నేత శరద్ పవార్ అభ్యర్థిత్వాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల సరళిపై, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ తర్వాత సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశమైంది.












Click it and Unblock the Notifications