కాంగ్రెస్ నేత శ్రీదేవిపై వ్యభిచారం కేసు
నాగార్జున సాగర్: పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్‌లో అధికార పార్టీ నేతల సహకారంతో కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పోలీసులు పైలాన్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో వ్యభిచారం చేస్తున్న స్థానిక యువజన కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి శ్రీదేవిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా సాగర్‌లో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం వెనుక సదరు నేత క్రీయాశీలక పాత్ర వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేసి వ్యభిచార రాకెట్ గుట్టురట్టు చేశారు. శ్రీదేవిపై కేసు నమోదు చేసినట్లు విజయపురి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలిపారు.












Click it and Unblock the Notifications