ఎల్టీటిఇపై శ్రీలంక కాల్పుల విరమణ
కొలంబో: శ్రీలంక ప్రభుత్వం సోమవారంనాడు తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. ఉత్తర ప్రాంతంలో సైనిక చర్య ముగిసిందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అధిక సామర్థ్యం గల ఆయుధాలు వాడకూడదని, వైమానిక దాడులను ఆపాలని ప్రభుత్వం సైనికులను ఆదేశించింది. బందీలను విడిపించేందుకు మాత్రమే ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించింది.
ఎల్టీటిఇ ఆదివారం సాయంత్రం ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించలేదు. చివరగా సోమవారం అందుకు అంగీకరించింది. బారత్ ఒత్తిడికి తలొగ్గే శ్రీలంక ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించినట్లు భావిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వమే శ్రీలంకతో కాల్పుల విరమణను ప్రకటింపజేసిందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పారు.












Click it and Unblock the Notifications