నారాయణ మాటల్లో తప్పు లేదు: వినోద్
హైదరాబాద్: తెలంగాణపై మహాకూటమి ఎటువంటి తీర్మానం కూడా చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అయితే శాసనసభ తొలి సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయాలని పట్టుబడుతామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై మహా కూటమిలో ఉమ్మడి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని, అందువల్ల మహా కూటమి ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ శాసనసభలో తీర్మానం చేస్తుందని నమ్ముతున్నామని ఆయన చెప్పారు. తెరాస తెలంగాణ రాష్ట్ర సాధనకోసమే ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర సాధనకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications