బాబ్రీ రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఏచూరి
పాట్నా: బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కాపాడడంలో కాంగ్రెస్ విఫలమైందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్ష బాధ్యత బిజెపిదని ఆయన అభిప్రాయపడ్డారు. బాబ్రీ మసీద్ విషయంలో బిజెపి హంతక పాత్ర నిర్వహిస్తే, పోలీస్ కెప్టెన్ గా కాంగ్రెస్ తన విధులను నిర్వర్తించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
బాబ్రీ మసీదును కాపాడడానికి కాంగ్రెస్ అన్ని తీసుకోవాల్సి ఉండిందని, దేశాన్ని అవమానపరిచిన వారి చేతులకు ఆ విషయాన్ని కాంగ్రెస్ వదిలేయాల్సింది కాదని ఆయన అన్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేతకు కాంగ్రెస్ సమానమైన బాధ్యతను తీసుకోవాలా అని అడిగితే కోత్వాల్ బాధ్యతలు నిర్వర్తించడంలో కాంగ్రెసు విఫలమైందని ఆయన జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications