సోనియా సంతృప్తి చెందారు: డిఎస్

తాము రాష్ట్రంలో కచ్చితంగా 30 లోకసభ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేశారని, ఫలితాలు ఇంకా వెలువడలేదని, ఇప్పుడు రాబోయే ఫలితాల గురించి చెప్పడం సరి కాదని, అయితే ఎవరి అంచనాలు వారికి ఉంటాయని, తమ అంచనాలు తమకు ఉన్నాయని ఆయన అన్నారు. తమ అంచనాలను మాత్రమే సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు.
తొలుత ఒకేసారి రాజశేఖర రెడ్డి, డి.శ్రీనివాస్ లతో సమావేశం కావాలని భావించిన సోనియా తర్వాత వారితో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనాలు వెలువడుతున్న సమయంలో తమతో కలిసి వచ్చే పార్టీలపై ఆమె డి.శ్రీనివాస్ తో ఆరా తీసినట్లు సమాచారం. ఒక వేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆమె డిఎస్ ను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications