హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూటమికి 170 సీట్లు: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో ధీమా వ్యక్తంచేసింది. కూటమికి 170 స్థానాలు ఖాయమని, అనుకూల పవనాలు వీస్తే 200స్థానాలు వస్తాయని అంచనావేసింది. మే నెల 9 నుంచి 13వరకు రోజుకు 50 నియోజకవర్గాల చొప్పున ప్రతి నియోజకవర్గం పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించింది. పార్టీ వార్షికోత్సవం 'మహానాడు'ను హైదరాబాద్‌లో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించనుంది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశమైంది. సమావేశం వివరాలను కె.ఎర్రంనాయుడు తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు.

అధికారంలో తెరాస, వామపక్షాలు కూడా భాగస్వాములవుతాయా? అన్న ప్రశ్నకు తామంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన సమాధానమిచ్చారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, ఆ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చామని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెడతామని తెలిపారు. తెరాస అధినేత కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై ప్రశ్నించగా ఎవరైనా ఢిల్లీ వెళ్లొచ్చని, అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు. మహాకూటమి నేతలు కేసీఆర్‌, రాఘవులు, నారాయణ తదితరులు ఎన్నికల్లో బాగా సహకరించారని అభినందించారు. కార్యకర్తలు చావో రేవో అన్నట్లుగా పనిచేశారని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలకు చంద్రబాబు మంగళవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో విందు ఇవ్వనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X