రాంపూర్: ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ లోకసభ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమె ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు స్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ధర్మపాల్ సింగ్ చెప్పారు.
మహిళా ఓటర్లకు బిందీలు పంపిణీ చేసినందుకు గాను ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదకు పోలీసులు నోటీసు జారీ చేశారు. ఆమె నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ధర్మపాల్ సింగ్ చెప్పారు.