జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే: మోడీ

జైలుకు వెళతావా? లేదా ఉరికంబం ఎక్కుతావా? అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తే కచ్చితంగా నేను ఉరినే ప్రేమిస్తానని, ఎందుకంటే మళ్లీ జన్మించి గుజరాత్ ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే జైలుకు పోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ నన్ను హెచ్చరించారని, గోద్రా తదనంతర అల్లర్లపై సుప్రీంకోర్టు సిట్‌కు ఆదేశాలు జారీచేయకముందు 15రోజుల కిందట ఈ సంఘటన జరిగిందని, దీని అర్థమేమిటని, తనను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్ర కాదా ఇది అని మోడీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నేను సాగిస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. 'ఢిల్లీ సుల్తానులు' నన్ను జైల్లో బంధించినా, నా పోరాటం ఆగదు' అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications