పాక్ ఉగ్రవాదికి జీవిత ఖైదు
హైదరాబాద్: మన దేశానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసే యత్నాల్లో పోలీసులకు దొరికిపోయిన పాకిస్థానీ ఉగ్రవాది మాలిక్ అర్షద్ మహ్మద్‌కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం జీవితఖైదు విధించింది. 2004లో నకిలీ పాస్‌పోర్టుతో బంగ్లాదేశ్‌నుంచి వచ్చిన అర్షద్ కీలకపత్రాలు పాకిస్తాన్ కు చేరవేస్తూ హైదరాబాదులోని కింగ్‌కోఠీలో పోలీసులకు చిక్కాడు.కోర్టు అతన్ని దేశద్రోహిగా నిర్ధారించింది.
అప్పటినుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతనిపై కేసు నడుస్తోంది. అతను హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోర్టు అతనికి గురువారంనాడు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.భారతదేశానికి చెందిన పలు కీలకమైన రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసే పనిలో మహ్మద్ నిమగ్నమైనట్లు రుజువైంది. ఇంటర్నెట్ ద్వారా భారత సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేయానికి అర్షద్ సేకరించిన ఫొటోలను, ఇతర పత్రాలను పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో రక్షణ రంగానికి చెందిన పలు ప్రధానమైన సంస్థలున్నాయి.












Click it and Unblock the Notifications