వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ జీవన్మరణాలపై ఇంకా వివాదం కొనసాగుతోంది. లాడెన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. రెండు రోజుల క్రితం లాడెన్ చనిపోయాడని పాక్ అధ్యక్షుడు జర్ధారి చేసిన ప్రకటనపై ఒబామా స్పందించారు. లాడెన్‌ను ప్రాణాలతో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. తాలిబాన్లు, అల్ ఖైదా వల్ల ప్రపంచానికి ముప్పు వుందని వాటిని నాశనం చేస్తామని చెప్పారు. స్వయం కృత అపరాధమే పాకిస్థాన్ ప్రస్తుత దుస్థితికి కారణమని బబామా తెలిపారు. విశ్వవ్యాప్తంగా గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెడుతామని ఆయన చెప్పారు.