ముంబయి: ముంబయి దాడుల తీవ్రవాది అజ్మల్ కసబ్ వయస్సు నిర్ధారణకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికపై ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును మే2 కు వాయిదా వేసింది. ఇదే సమయంలో కసబ్ తనకు టూత్ పేస్టు, అత్తర్లు, ఉర్దూ పత్రికలు కావాలని న్యాయమూర్తిని కోరాడు. తానున్న సెల్ బయట వరండాలో పచార్లుచేసే అవకాశం కూడా ఇవ్వాలని, లేకపోతే నాలుగు గోడల మధ్య తన మానసిక స్థైర్యం దెబ్బతినేట్టుగా ఉందని కూడా కసబ్ కోరాడు.