సిటీలో స్వైన్ ఫ్లూ బాధితుడు
హైదరాబాద్: హైదరాబాదులో స్వైన్ ఫ్లూ బాధితుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టెక్సాస్ నుంచి ఆ స్వైన్ ఫ్లూ బాధితుడు నగరానికి చేరుకున్నట్లు ఒక తెలుగు ప్రైవేట్ టీవీ చానెల్ వార్తా కథనాన్ని ప్రసారం చేయడంతో హైదరాబాదులో కలకలం మొదలైంది. ఆ వార్తాకథనం ప్రకారం-టెక్సాస్ నుంచి వచ్చిన వ్యక్తి స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అతని పేరు వెల్లడించడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న మరి కొందరు కూడా నగరానికి చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. గత పది రోజులుగా హైదరాబాదు చేరుకున్న విదేశీయుల వివరాలను అధికార వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు తప్పని సరి అని ఆ వర్గాలంటున్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications