ఐదో నెంబర్ ప్రమాద స్ధాయికి స్వైన్ ఫ్లూ
జెనీవా: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంటువ్యాధి ప్రమాద స్థాయిని 5వ స్థానానికి పెంచింది. ప్రపంచవ్యాప్త అత్యంత తీవ్ర అంటువ్యాధి స్థానానికి కేవలం ఒకటే తక్కువ. కనీసం రెండు దేశాల్లో మనిషి నుంచి మనిషికి అంటువ్యాధి వ్యాపిస్తే అది 5వ స్థాయి కింద లెక్క. ఒక ఐదు సంవత్సరాల మెక్సికో చిన్నారి అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వ్యాధితో మరణించడంతో ప్రమాదస్థాయిని పెంచారు. వ్యాధి పుట్టిన మెక్సికో బయట ఇదే తొలి స్వైన్ ఫ్లూ మరణం. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ మాట్లాడుతూ, వ్యాధి 5వ స్థాయికి చేరడమంటే అన్ని దేశాలు పూర్తిస్థాయిలో వ్యాధి నివారణకు సన్నద్ధంగా ఉండాలని సూచన అన్నారు. ఇది అన్ని దేశాల ప్రభుత్వాలకు, ఆరోగ్యశాఖలకు, ఫార్మా కంపెనీలకు, వ్యాపార, వాణిజ్య రంగాలకు తీవ్రస్థాయి హెచ్చరికగా పరిగణించాలని, ఆయా రంగాలు, శాఖలు సత్వరం తమ తమ విధుల్లో స్పందించాలని ఆదేశంగా వర్తిస్తుందని ఆమె ప్రకటించారు.
స్వైన్ ఫ్లూ నివారణకు ఆరోగ్యశాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కానీ వారి గమ్యస్ధానాలకు పంపించకూడదని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 148 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క అమెరికాలోనే 91కేసులున్నట్లు అమెరికాలోని వ్యాధుల నియంత్రణ-నివారణ కేంద్రం తెలిపింది. హెచ్1ఎన్1-2009గా పిలువబడుతున్న ఈ వ్యాధి జనించిన మెక్సికోలో ఐదు రోజులపాటు అన్ని రకాల పనులు, సేవలు రద్దు చేశారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ ప్రకటించారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications