నల్లమలలో వేట: అరుగురి అరెస్టు
మహబూబ్ నగర్: రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో జంతువులను వేటాడిన ఆరుగురిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. వారి నుంచి కారును, మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిలో ఇద్దరు సాయుధ కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగతా నలుగురు హైదరాబాదులోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగులు. అరెస్టయినవారిలో ఇంజనీర్ రవీంద్రనాథ్, కృష్ణారెడ్డి, నాగరాజ్ ఉన్నారు.
ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు నల్లమలలోని బల్మూరు అడవుల్లో వేటకు సాయుధ కానిస్టేబుళ్లు సహకరించినట్లు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను కేసు నుంచి తప్పించేందుకు హైదరాబాదులోని రాజకీయ నాయకుల నుంచి, ఇతర పెద్దల నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications