అధికారం మాదే: చంద్రబాబు

ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో తాము ప్రకటించిన పథకాలు బడుగుల జీవితాలను బాగు చేస్తాయని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు లక్ష రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం తాము కార్యక్రమాలు చేపడుతామని కూడా ఆయన చెప్పారు. వచ్చే మేడే నాటికి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన అన్నారు. ఐదేళ్ల కాంగ్రెస పాలన రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను పెంచిందన్నారు. తాము అధికారంలోకి రాగానే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రెండు లక్షల రూపాయల ప్రమాదభీమా, వృద్ధులకు పింఛన్ సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications