అవినీతికిదే నిదర్శనం: చిరు

ప్రజారాజ్యం పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులతో పార్టీ అధినేత చిరంజీవి జరుపుతున్న సమీక్షా సమావేశాలు వరుసగా మూడోరోజూ శుక్రవారం కూడా కొనసాగాయి. శుక్రవారం అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులు, నాయకులతో చిరంజీవి సమావేశమయ్యారు. పార్టీ జయాపజయాలు, పోలింగ్ సరళిపై చర్చించారు. ప్రధానంగా మహిళలు, యువత ఎక్కువ సంఖ్యలో పీఆర్పీకి మద్దతు ఇచ్చినట్లు అభ్యర్థులు చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. రెబల్స్ ప్రభావం పార్టీపై ఏ మేరకు పడుతుందనే విషయాన్ని చిరంజీవి ఆరా తీశారు.












Click it and Unblock the Notifications