హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తమతో కలసి వస్తే సంతోషమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఎన్నికల తర్వాత చిరంజీవి తమ వైపు వస్తామంటే తృతీయ ఫ్రంట్ లోకి ఆహ్వానిస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే పార్టీలను తాము ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం ఉన్న చోట తాము ఉండబోమని ప్రజారాజ్యం నాయకులు చెప్పారని, అందువల్ల తృతీయ కూటమిలోకి రావాలా వద్దా అనే విషయాన్ని తేల్చుకోవాల్సింది చిరంజీవేనని ఆయన అన్నారు.