డాడీ కాంగ్రెస్ లో చేరాల్సింది: త్రిషాలా
ముంబయి: తన డాడీ కాంగ్రెసులో చేరి తన తాత సునీల్ దత్ వారసత్వాన్ని కొనసాగించి ఉండాల్సిందని బాలీవుడ్ నటుడు, సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ దత్ కూతురు త్రిషాలా అంటోంది. ఆమె సంజయ్ దత్ తీరు పట్ల, తన సవతి తల్లి మాన్యత పట్ల తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ లో చదువు పూర్తి చేసిన తర్వాత త్రిషాలాను ఇంటికి అహ్వానించి సంజయ్ దత్ కుటుంబాన్నిపరిపూర్ణం చేస్తానని మాన్యత చెప్పిన మాటలపై త్రిషాలా వ్యంగ్యంగా ప్రతిస్పందించింది. అది తన ఇల్లు అని, తన ఇంటికి తాను రావడానికి ఆహ్వానం అవసరం లేదని, తాను స్వతంత్రంగా ఉండగలనని భావించినప్పుడు తానే వస్తానని త్రిషాలా అంది.
పార్టీ ప్రచారంలో నిండా మునిగిపోయిన సంజయ్ దత్ నెల రోజులుగా త్రిషాలాతో మాట్లాడలేదు. రెండేళ్ల వరకు తాము చాలా సన్నిహితంగా ఉన్నామని, జరిగిన తప్పేమిటో కనిపెట్టడానికి ఇప్పటికే ఆలస్యం జరిగిందని, తమ సంబంధాల పట్ల తాను ఉద్వేగానికి గురి కావడం లేదన, తన డాడీ వైఖరే తనకు వచ్చిందని ఆమె అంటోంది. మాన్యత గురించి తనకు ఎక్కువగా తెలియదని ఆమె అంటోంది. తన అత్త ప్రియాదత్ తో మాత్రం త్రిషాలా ప్రతి రోజూ మాట్లాడుతోందట.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications