సిఎం రేసులో లేను: డిఎస్

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు తీసుకుంటామని ఆయన చెప్పారు. యుపిఎ అయినా, ఎన్డీయె అయినా ఫరవాలేదు తెలంగాణ ఇచ్చేవారితో కలుస్తామని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారని, అందువల్ల కేంద్రంలో తెరాస మద్దతు తీసుకోవడానికి తమ పార్టీకి అడ్డంకులేమీ లేవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ పనితీరు బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications