కరెంట్ షాక్‌తో తండ్రీ కొడుకుల మృతి
వరంగల్: వరంగల్ జిల్లాలో కరెంట్ షాక్ తో ఓ రైతు, ఆయన కుమారుడు మృతి చెందారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలో వరికోలు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొమురయ్య అనే రైతు తనకున్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వేసవి సెలవులు కావటంతో తన ఇద్దరు కుమారులను పొలం పనికి తీసుకెళ్లాడు. పెద్దకుమారుడు రాము చేనుకు నీరు పారిస్తూ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కొడుకును రక్షించబోయి కొమురయ్య కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications