పోలీసుల చేతిలో టెర్రరిస్టు నిస్సార్
హైదరాబాద్: పేరు మోసిన తీవ్రవాది నిస్సార్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతన్ని అజ్ఞాత ప్రదేశంలో అతన్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 2001లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో ఇతను ప్రధాన నిందితుడు. గత ఏడేళ్లుగా అతను పరారీలో ఉన్నాడు. అతను మాజీ ఎఆర్ కానిస్టేబుల్ కుమారుడు. రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిస్సార్ ను అరెస్టు చేశారు.
నిస్సార్ లష్కరే తోయిబా కార్యకర్త. 2002 నుంచి నిస్సార్ ఆచూకీ తెలియడం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చెచెన్యా, ఇరాక్ దేశాల్లో నిస్సార్ పని చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాదు నుంచి పారిపోయిన నిస్సార్ బంగ్లాదేశ్ లో తలదాచుకుని ఇటీవలే భారత్ కు చేరుకున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులోని సంతోష్ నగర్ లో పోలీసులపై కాల్పులు జరిపిన వికార్ నిసార్ అనుచరుడని తెలుస్తోంది.
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
పోలీస్ శాఖలో కొలువుల జాతర!, ఏ క్షణమైనా మెగా నోటిఫికేషన్? -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications