నాకు బెదిరింపులు: సత్యనారాయణ
సంగారెడ్డి: తనను చంపుతామని ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం మెదక్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ఇక్బాల్ కు ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏ నెంబర్ల నుంచి వచ్చాయో కూడా ఆయన చెప్పారు. ఆ నెంబర్లను కూడా ఆయన ఎస్పీకి ఇచ్చారు.
సత్యనారాయణ మహారాష్ట్ర పర్యటనలో ఉండగా ఈ ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications