రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మంది చనిపోయారు. మెదక్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి. మెదక్ జిల్లా సదాశిపేట మండలం గొల్లగూడెంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం కారును లారీ ఢీ కొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కృష్ణా జిల్లాలోని కానూరు వద్ద పెళ్లి బృందంతో వెస్తున్న లారీని వరికోత యంత్రం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కంచికచర్ల మండలం కునికి పాడు గ్రామ వాసులుగా గుర్తించారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం శ్రీనివాస్ నగర్ సమీపంలో లారీ, జీపు ఢీకొనటంతో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications