ప్రజారాజ్యం సూపర్ హిట్: చిరు

ఆదివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామన్న ఆశాభావం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. "మన రాష్ట్రంలో 72 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే దాదాపు 15శాతం పెరిగింది. మహిళలు, యువత అత్యధికంగా ఓట్లు వేశారు. వీరందరూ ప్రజారాజ్యంతోనే ఉన్నారు. అదనంగా పోలింగ్‌కు హాజరైనవారు అభివృద్ధి మంత్రం జపిస్తున్న పార్టీకో..నగదు బదిలీ పథకానికో ఓటువేయలేదు. ప్రజలు మార్పు కావాలని కోరుతున్నారు. ప్రత్యామ్నాయం కావాలని నిశ్శబ్ద విప్లవ ఓటుతో ప్రజారాజ్యానికి పట్టంకట్టబోతున్నారు" అని చిరంజీవి చెప్పారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి డబ్బు ప్రవాహం కనిపించినా ప్రజలందరూ కూడబలుక్కొని తమకు ఓటేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. వందకే వంటసరకు పథకంపై తొలి సంతకం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications