కేర్ లో విషాహారం, 75 మంది సిక్
హైదరాబాద్: కేర్ ఆస్పత్రిలోని కలుషిత ఆహారం తిని 75 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి భోజనం తర్వాత ఈ 75 మందికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. అయితే బంజారాహిల్స్‌లో చికిత్స పొందుతున్న ఈ విద్యార్థుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి వీరికి ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కేర్‌లో కలుషిత ఆహారంతో ఓ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందింది. ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహారంలో శుభ్రత పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అప్పట్లో డిమాండ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications