అన్నవరం కల్యాణ ఉత్సవాలు
అన్నవరం: అన్నవరం సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వారం రోజులపాటు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. వైశాఖ శుద్ధ దశమి లగాయితు బహుళ పాఢ్యమి వరకు వేడుకలు నిర్వహిస్తారు. మొదటిరోజు సోమవారం సాయం త్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసి ఏడు గంటలకు రత్నగిరిపై రాజరామరాయ కళామందిరంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇందుకోసం కళా మందిరానికి వివిధ రంగులు అద్దారు. ఈ వారం రోజులపాటు స్వామివారి వెండి వాహనా లపై ప్రతిరోజూ గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై గ్రామం నలువీధుల్లోనూ ఊరేగించ నున్నారు. స్వామివారి కల్యాణానికి గ్రామస్తులను ఆహ్వానించేందుకు ప్రతీకగా ఈ ఊరేగింపు నిర్వ హిస్తారని దేవస్థానం పండితులు పేర్కొన్నారు. రెండవ రోజున సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మ వార్లను వెండి గరుడ వాహనంపైనా సీతారా ముల ను వెండి గజవాహనంపైనా మేళతాళాలు, వేద పండితుల వేద ఆశీర్వచనాల నడుమ ఊరేగిస్తారు.
రాత్రి 9.30 గంటలకు కొండపైన సర్వాంగ సుం దరంగా అలంకరించిన శాశ్వత కల్యాణ వేదికపై కల్యాణ మహోత్సవాన్ని వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహిస్తారు. మూడవ రోజున స్వామి అమ్మవార్లను రావణ వాహనం, నాల్గవరోజు పొన్న వాహనం, ఐదవ రోజున వెండి రథంపై ఊరేగింపు నిర్వహించి ఆరవరోజున స్వామి అమ్మవార్లకు పవి త్ర పంపా సరోవరంలో శ్రీచక్ర స్నానం గావిస్తారు. చివరిరోజైన 10వ తేదీన శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సం దర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను చైర్మన్ రామ్ కుమార్, ఈవో ఎస్.కొండలరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా సత్యప్రభను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.












Click it and Unblock the Notifications