కెసీఅర్ ఢిల్లీ టూర్ మళ్ళీ వాయిదా

ఆరో తేదీన ఆయనతో పాటు పార్టీకి చెందిన శాసనసభ అభ్యర్థులు, లోక్ సభ అభ్యర్థులు కూడా వెళ్లనున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ అధికారంలో వచ్చే అవకాశాలున్నాయని చంద్రశేఖరరావు ఒక ఇష్టాగోష్టి సమావేశంలో అనడం గమనార్హం. ఆయన బిజెపి అగ్ర నాయకులతో ఢిల్లీలో మంతనాలు జరుపబోతున్నారు. తెలంగాణ సాధన కోసం అవసరమైతే ఎన్డీఏకు టీఅర్ ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.
జాతీయ రాజకీయాల్లో మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారని కెసీఅర్ అంచనా వేశారు. ప్రజారాజ్యం పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది లోక్ సభ స్ధానాలు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. చిరంజీవి సరైన సమయంలో రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications