వ్యభిచార ముఠా అరెస్టు
అనంతపురం: అమ్మాయిలను ట్రాప్ చేసి బెంగళూరులో విక్రయిస్తున్న ఓ ముఠాను స్థానికులు గట్టురట్టు చేశారు. బ్రోకర్‌తో పాటు గోరంట్ల వాసి నాగమణిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. తాను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ కూతురును ట్రాప్ చేసి బెంగళూరు తరలించినట్లు సమాచారం. ఇంటర్ చదువున్న స్వాతి అనే అమ్మాయి రెండు రోజులుగా కనబడకుండా పోయింది. తమ ఇంటిలో అద్దెకు ఉంటున్న నాగమణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో స్వాతి తల్లిదండ్రులు నాగమణిపై దాడి చేసి చితకబాదారు.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాగమణిని విచారించి కనిపించకుండా పోయిన స్వాతి కోసం వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అనంతపురంలో చాలా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని చాలా మంది కంప్లైయింట్ చేస్తున్నారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబాయి, పూణె రెడ్ లైట్ ఏరియాకు యువతకులను తరలిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది జరుగుతున్న పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications