కడప: నగదు బదిలీ పథకం ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ బుర్రకు తట్టలేదని ఆర్థికశాఖ మంత్రి రోశయ్య చెప్పారు. ఈ ఆలోచన కలిగి ఉంటే ఆ పథకాన్ని అమలు చేసే వారన్నారు. ఆదివారం కడపలోని రాష్ట్ర అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ వంటి ముఖ్యమంత్రిని తన సర్వీసులో చూడలేదని ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నగదు రూపంలో పింఛన్లు అందజేస్తున్నందున డబ్బుల పంపిణీకి పేరు మార్చి నగదు బదిలీ పథకంగా తెదేపా ప్రచారం చేసిందన్నారు. 13 దేశాల్లో ఇప్పటికే అమలవుతున్న ఈ పథకాన్ని పేరు మార్చి తెదేపా తన మేనిఫెస్టోలో చేర్చినట్లు చెప్పారు.