పాట్నా:"లాలుప్రసాద్ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రధానమంత్రి అవుతారు" అంటూ ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ధీమా వ్యక్తంచేశారు. లాలూ తరపున ప్రచారానికి వెళ్లేముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ప్రధాని పదవికి రేసులో ఉన్న ఎంతోమంది కంటే లాలూకే ఎక్కువ అర్హతలున్నాయని, అందువల్ల ఆయన కచ్చితంగా ప్రధాని కావడం ఖాయమని రబ్రీదేవి ఓటర్లుకు చెబుతున్నారు. అలాగే ఇదే విషయాన్ని ఆమె ప్రచారంలో సైతం ప్రస్తావిస్తున్నారు. లాలూ కూడా తాను ప్రధాని కావాలన్నఆశను బహిరంగంగా చెప్తున్న విషయం తెలిసిందే.