పోకిరీకి 'యువరాజ్యం' గుణపాఠం
కరీంనగర్: తనను ప్రేమించాలనీ, లేకపోతే యాసిడ్ పోస్తానని ఓ వైద్యురాలిని బెదిరించిన యువకుడిని యువరాజ్యం నేతలు చితకాబాదారు. కరీంనగర్‌లో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని రాజీవ్‌నగర్‌కాలనీకి చెందిన అంథోని (26) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో అతని స్నేహితుని ఇంట్లో శుభకార్యానికి 10 రోజుల క్రితం వచ్చాడు.నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డెంటిస్టుగా పనిచేస్తున్న యువతిని వారంరోజులుగా ప్రేమించమని వెంటపడుతున్నా డు.
తన ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఆ యువతి యువరాజ్యం నాయకులను కలిసి విషయం తెలియజేసింది. బుధవారం ఉదయం ఆసుపత్రికి వెళుతుండగా అంథోని ఆమెను వెంబడించాడు. ఇది గమనించిన యువరాజ్యం నేతలు ఎండి ఆరిఫ్, హరిప్రసాద్‌ల ఆధ్వర్యంలో యువకులు అతన్ని పట్టుకుని చితకబాది టూటౌన్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications