మురాదాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ కాంగ్రెసు లోకసభ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయనపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కేసు నమోదైంది.
అజర్ మురాదాబాద్ ప్రజలకు కరపత్రాలు పంచారు. ఆ కరపత్రాలపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేకపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై ఆయన మీద నగీనా దెహాత్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది.