రెండు లక్షలతో పట్టుబడ్డ సిఐ
విశాఖపట్నం: విశాఖపట్నం త్రీటౌన్ సీఐ ప్రసాదరావు రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఎసిబి)కి పట్టుబడ్డారు. భూ వివాదం కేసుకు సంబంధించి బాధితుడినుంచి లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ వలపన్ని సీఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బాధితుడి నుంచి ఇంటిలో రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
పోలీసు స్టేషన్ లో, ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీ మొత్తంలో నగదును, రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఇంటిలో 11 లక్షల రూపాయల అనధికార నగదు ఎసిబి అధికారులకు చిక్కింది. గతంలో విజయనగరం జిల్లా ఎస్ కోటలో పనిచేసినప్పుడు కూడా ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి కేసులు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications