బాబుతోనే ఉంటాం: విజయశాంతి

ఫలితాలు వెల్లడి కాక ముందే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ విషయంలో అద్వానీ, సోనియాగాంధీ తదితరులతో చర్చించడంలో తప్పేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సిమ్లా కు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లినప్పుడు తమ నేత ఢిల్లీ వెళ్తే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. కేంద్ర రాజకీయాలలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పో షించనున్నదని, అన్ని పార్టీలు టీఆర్‌ఎస్ చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. టీఆర్ ఎస్ తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆ పార్టీ కలలు కంటోందని, తాము మహాకూటమి లోనే ఉంటామని, కాంగ్రెస్‌తో కలిసే పరిస్థితి రాదన్నారు.
కాంగ్రెస్‌మద్దతుతో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల గురించి ప్రశ్నించగా చిరంజీవి కూడా పగటి కలలు కంటున్నారని, ఫలితాలు వచ్చే వరకైనా తృప్తి పడనీయండన్నారు. అధికారంలోకి ఎవరు వస్తారో ఈ నెల 16న తేలుతుందంటూనే ఆ రోజు కాంగ్రెస్ దిగిపోవడం, మహాకూటమి అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లు రావడం ఖాయమని విజయశాంతి చెప్పారు.












Click it and Unblock the Notifications