చిరుసాయం కోసం అశ్వనీదత్

ఇక సినిమా రంగంలో చిరంజీవి, అల్లు అరవింద్‌లకు అత్యంత సన్నిహితుడైన అశ్వనీదత్ మొదటి నుంచీ తెలుగుదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే 2004 ఎన్నికల్లో విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు..అప్పుడు ఆయన గెలుపుకి ప్రచారం కోసం చిరంజీవి అక్కడికి వెళ్లారు. ఇక మహాకూటమిలో కీలక భాగస్వామి అయిన తెరాస కేంద్రంలో ఎన్డీఏకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్న కొద్దిగంటల వ్యవధిలోనే తాజా పరిణామం చోటుచేసుకోవటం విశేషం. అలాగే ఎవరితో కలిస్తే కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీకి ఎక్కువ ప్రయోజనముంటుందో బేరీజు వేసి ప్రరాపా తుదినిర్ణయం తీసుకుంటుందని చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడు తెలపటం విశేషం.












Click it and Unblock the Notifications