కసబ్ నవ్వుపై జడ్జీ ఆగ్రహం
ముంబయి: ముంబయి దాడుల ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్ నవ్వడంపై న్యాయమూర్తి సోమవారం తీవ్రంగా మండి పడ్డారు. తాను, తన సహచరుడు అబూ ఇస్మాయిల్ వాడిన గన్ లను సాక్షి గుర్తిస్తున్న సమయంలో కసబ్ కోర్టులో పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. దీంతో న్యాయమూర్తి బిగ్గరా అరిచి, ఎందుకు నవ్వుతున్నావని కసబ్ ను ప్రశ్నించారు. విచారణ సాగుతున్నందున కసబ్ తన డ్రామాను ఆపాలని ఆయన ఆదేశించారు.
కోర్టుకు వచ్చింది మొదలు కసబ్ నవ్వడం మొదలు పెట్టాడు. తొలి సారి కసబ్ కోర్టుకు వచ్చాడు. కసబ్ గ్రే టీ షర్టు, బ్లూ ట్రాక్ ప్యాంట్ ధరించాడు. తాను అందరి దృష్టికి కేంద్ర బిందువు కావడం కసబ్ ను సంతోషపెట్టినట్లు ఉంది. దాంతో విచారణ జరుగుతున్నంత సేపూ నవ్వుతూనే కనిపించాడు. ఏమైనా చెప్పదలుచుకున్నావా అని న్యాయమూర్తి విచారణకు ముందు కసబ్ ను ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు చెప్పేదేమీ లేదని, ఏదైనా చెప్పాలనిపిస్తే న్యాయవాదికి చెప్తానని కసబ్ సమాధానమిచ్చాడు.












Click it and Unblock the Notifications