బాబు గద్దె కోసం యాగంలో రోజా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆశిస్తూ హైదరాబాదులోని కూకట్ పల్లిలో సోమవారం జరిగిన యాగంలో తెలుగు మహిళ రోజా పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావాలని కొరుతూ కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు యాగం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.
ఐదేళ్ల కాంగ్రెసు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు దాంతో తెలుగుదేశం పార్టీకి పెద్ద యెత్తున ఓటేశారని ఆమె అన్నారు. మహిళలను నగదు బదిలీ పథకం బాగా ఆకట్టుకుందని, మహిళలు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లేశారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications