తివారీ పితృవాదం కేసు వాయిదా

ND Tiwari
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీపై పితృవాదం కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు జులై 9వ తేదీకి వాయిదా వేసింది. తనను తివారీ తన కొడుకుగా అంగీకరించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. రోహిత్ శేఖర్ తన కొడుకు కాడని, ఈ విషయాన్ని డిఎన్ఎ పరీక్ష చేసి రుజువు చేసుకోవచ్చునని రోహిత్ శేఖర్ తండ్రి బిజి శర్మ కోర్టులో పిటిషన్ వేశారు. తాను రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వల శర్మను పెళ్లి చేసుకున్నప్పటికీ 1970 నుంచి తాము విడిగానే ఉంటున్నామని, అందువల్ల రోహిత్ శేఖర్ తనకు పుట్టలేదని అతను వాదిస్తున్నాడు. తాము 2006లో విడాకులు తీసుకున్నప్పటికీ 1970 నుంచే విడిగా ఉంటున్నామని అతను చెప్పాడు. డిఎన్ఎ పరీక్షలను నిర్వహించాలని అతని విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సాక్ష్యాలు లేకుండా అటవంటి పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు ఇటువంటివి వచ్చే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఉజ్జ్వల శర్మ బి.పి.శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ఆమె వైవాహిక సంబంధాన్ని కొనసాగిస్తూనే తనతో సంబంధం పెట్టుకుందని, బిపి శర్మతో ఉజ్జ్వల శర్మ సంసారం చేస్తున్న కాలంలో రోహిత్ శంకర్ పుట్టాడని తివారీ ఇంతకు ముందు కోర్టుకు వివరించారు. తివారీ వ్యవహారంపై ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో రక్షణ మంత్రిగా పనిచేసిన షేర్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖలు రాశారు. తాను ఢిల్లీలో 3, కృష్ణ మీనన్ మార్గ్ నివాసంలో ఉన్నప్పుడు తివారి తన ఇంటికి తరుచూ వచ్చేవారని, అప్పట్లో (1969) తివారీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని, తమ కూతురు ఉజ్జ్వల యువజన కాంగ్రెస్ మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా పని చేసేదని ఆయన వివరించారు.

ఈ పితృవాదం కేసులో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎన్‌డీ తివారీకి ఇంతకు ముందు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరునుంచి ఆయనకు మినహాయింపు లభించింది. తివారీ తనకు తండ్రి అంటూ కేంద్ర మాజీ మంత్రి షేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ దాఖలు చేసిన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, ఈ కేసులో తమ ముందు తివారీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తివారీ తరఫు న్యాయవాది డివిజన్ బెంచ్ కు వెళ్లారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని, గవర్నర్ పదవిలో ఉన్న తివారీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల ప్రతిష్ట దెబ్బ తింటుందని, అందువల్ల వారు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలియజేస్తూ ఈ నిబంధనల మేరకు తివారీ మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మినహాయింపు కోరవచ్చని ఈ నిబంధనను పొందుపరుస్తూ మరో పిటీషన్‌ దాఖలుచేయాలని గవర్నర్‌కు కోర్టు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+