ముంబై: ముగ్గురు రెడ్డి సోదరీమణుల్లో పెద్దావిడ సుష్మారెడ్డి వివాహ త్వరలో జరుగబోతోందట. సుష్మా, మేఘన, సమీరాల్లో సుష్మా పెద్దావిడ. తన పాత కళాశాల మిత్రుడినే ఆమె వివాహమాడబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అతను లండన్ లోని ప్రముఖ బ్యాంకర్లలో ఒకరు.
పాపులర్ మోడల్ అయిన సుష్మా సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. పెళ్లికి వేదికను నిర్ణయించడంతో పాటు అన్ని ఏర్పాట్లు సమీరారెడ్డే చూస్తోందట.