4,694 స్వైన్ ఫ్లూ కేసులు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 4,694 స్వైన్ ఫ్లూ లేదా ఎ (హెచ్1ఎన్1) కేసులను నిర్ధారించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలియజేసింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ కేసులు రెండింతలయ్యాయి. స్వైన్ ఫ్లూ వల్ల 53 మంది మరణించినట్లు కూడా సంస్థ తెలియజేసింది.
స్వైన్ ఫ్లూ కేసులు మెక్సికో, అమెరికాల్లో ఎక్కువ సంఖ్యలో నమోదైనట్లు, ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో ఉన్నట్లు తెలిపింది. మెక్సికోలో 1,626 కేసులు నమోదైనట్లు, 48 మరణాలు సంభవించినట్లు సంస్థ ఆరోగ్య భద్రత, పర్యావరణం డైరెక్టర్ జనరల్ డాక్టర్ కీజీ ఫుకుదా చెప్పారు. అమెరికాలో 2,532 కేసులు, మూడు మరణాలు నమోదైనట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications