కమల్ హాసన్ ఓటు గల్లంతు

Kamal Hassan
చెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పేరు ఓటర్ల జాబితా నుంచి గల్లంతైంది. హైదరాబాదులో ఉన్న ఆయన బుధవారం ఓటు వేయడానికి మంగళవారం సాయంత్రం చెన్నైకి బయలుదేరారు. ఇంతలో జాబితాలో తన పేరు లేదని తెలిసింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన ఓటు హక్కును నిరాకరించడం ఇది మొదటిసారి అని, షూటింగ్ మానుకోవడం వల్ల తనకు పది లక్షల రూపాయలకు పైగా నష్టం జరుగుతుందని, అయినా తాను ఓటేయాలనే పట్టుదలతో ఉన్నానని, ఈ స్థితిలో తనకు ఓటు లేకుండా చేశారని ఆయన అన్నారు. ఒక ఆంగ్ల దినపత్రికతో ఫోన్ లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఓటు లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తేవడానికి ప్రయత్నించానని, అయినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. కమల్ హాసన్ ఇల్లు గోడౌన్ కోసం అద్దెకు ఇచ్చారని, దీంతో కమల్ హాసన్ పేరు జాబితాలో చేర్చలేదని కార్పోరేషన్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రాజేశ్ లఖానీ చెప్పారు. కమల్ విఐపి జాబితాలో ఉన్నారని, రికార్డుల ప్రకారం రెండేళ్ల క్రితం కమల్ పేరును జాబితా నుంచి తొలగించారని, కమల్ నగర నివాసి కారని ఆయన అన్నారు.

అయితే ఎన్నికల అధికారి వాదనతో కమల్ విభేదిస్తున్నారు. తాను నగరంలో పన్ను చెల్లిస్తున్నానని, తాను ఎల్దాం చిరునామా నుంచి పన్ను చెల్లిస్తున్నానని, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నానని, ఈ విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగేశ్వరరావు పార్కు సమీపంలోని కార్పోరేషన్ స్కూల్లో ఓటేశానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+