బస్ స్టేషన్ సూట్ కేసులో శవం
హైదరాబాద్: హైదరాబాదులోని ఇమ్లిబన్ బస్ స్టేషనులో ఒక సూట్ కేసులో వ్యక్తి శవం బయటపడింది. బస్ స్టేషనులోని సామాన్లు భద్రపరిచే గదిలోని సూట్ కేసులో శవం బయటపడింది. ఈ సూట్ కేసును రాజ్ కుమార్ అనే వ్యక్తి సామాన్లు భద్రపరిచే గదిలో ఉంచినట్లు సమాచారం. మంగళవారం రాత్రి సూట్ కేసు నుంచి దుర్వాసన రావడం, నెత్తురు కారడం ప్రారంభించింది. దీంతో సంబంధిత ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా శవం బయటపడింది. హతుడు సంపన్నుడైనట్లు అర్థమవుతోంది. దీన్ని బట్టి డబ్బుల కోసమే ఆ వ్యక్తిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications