రాజకీయాలు వదలను: జయప్రద

తనను ఓడించడానికి ఆజంఖాన్ చేయని ప్రయత్నమంటూ లేదని, అందుకు ఆజంఖాన్ తన ప్రత్యర్థి, కాంగ్రెసు అభ్యర్థి నూర్ బానోను బలపరచడానికి కూడా వెనకాడలేదని ఆమె అన్నారు. తన నగ్న చిత్రాల పోస్టర్లను పంపిణీ చేయడం ఆజంఖాన్ కుట్రలో భాగమేనని, అది తనను తీవ్ర నిస్పృహకు గురి చేసిందని, కుటుంబ మద్దతుతో తాను దాని నుంచి బయటపడ్డానని, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆజంఖాన్ కు తగిన సమాధానం చెప్తానని ఆమె అన్నారు.
ఆజంఖాన్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా అడిగితే ఆ విషయంపై నిర్ణయాన్ని తాను సీనియర్ పార్టీ నేతలకు వదిలేస్తున్నట్లు ఆమె జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications