చెన్నై: తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడడానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడడానికి నిరాకరించారు. ఆయన బుధవారం చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే ఈ విషయంపై తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్నారు.
ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని అడిగితే చెప్పలేనని ఆయన జవాబిచ్చారు. తాను ఎవరికి ఓటు వేసింది వెల్లడించబోనని ఆయన చెప్పారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తాను ఓటు వేసినట్లు ఆయన తెలిపారు.